జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విజ్జేశ్వరం నుంచి కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ ఉదయం పది గంటలకు నిడదవోలు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంకు చేరుకుంటుంది.
అక్కడ నిర్వహించే జన్మదిన సభలో మంత్రి పాల్గొని కేక్ కట్ చేయనున్నారు. అనంతరం ఉదయం పదకొండు గంటల నుంచి వేడుకలకు విచ్చేసే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిధిలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
