బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలుపెడన మున్సిపల్ బరిలో జనసేన-కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం: చైర్‌పర్సన్‌గా బళ్ల జ్యోత్స్నారాణి.. ఆరు వార్డుల్లో జనసేన కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలు వెల్లడి!రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో వైఎస్ జగన్ భేటీ: స్థానిక సమరంలో పారదర్శకతపై వినతి.. అనంతరం మీడియాతో కీలక వ్యాఖ్యలు!గూడూరు జనసేనలో ముదిరిన సంక్షోభం: రేపటి నుంచి 66 ఏళ్ల సీనియర్ కార్యకర్త కనపర్తి వెంకన్న ఆమరణ నిరాహార దీక్ష.. పవన్ కళ్యాణ్ జోక్యానికి పట్టు!ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా: సమగ్ర షెడ్యూల్ విడుదల!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్: భారీగా పాల్గొన్న కూటమి శ్రేణులు, జనసైనికులు!విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు జనసేన అగ్రనేత కొణిదెల నాగేంద్రబాబు శుభాకాంక్షలు: ‘జనసేనతో మీ ప్రయాణం శుభప్రదం కావాలి’!విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు: భారీ ర్యాలీతో తరలివచ్చిన కూటమి శ్రేణులు, జనసైనికులు!పెడనలో అట్టహాసంగా కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నారాణి నామినేషన్ దాఖలు: హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జనసేన సమన్వయకర్తలు!స్థానిక సమరంలో జనసేన సంచలన పిలుపు: ‘ముందు నామినేషన్ వేయండి.. బలం చాటండి!’.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!
అమరావతి

సత్తెనపల్లిలో కూటమికి రెబెల్ సెగ: ‘ఈసారి మాట వినలేం పవనన్నా’.. బరిలోకి దిగుతున్న జనసేన నేతలు!

Slug: sattenapalli-janasena-rebel-candidates-contest-local-body-elections-social-media-post-viral
సత్తెనపల్లిలో కూటమికి రెబెల్ సెగ: ‘ఈసారి మాట వినలేం పవనన్నా’.. బరిలోకి దిగుతున్న జనసేన నేతలు!

​జన గళం సత్తెనపల్లి డెస్క్: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో స్థానిక సంస్థల సమరానికి ముందు ఎన్డీయే కూటమిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై అసంతృప్తితో ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులు సత్తెనపల్లి టౌన్ నుంచి రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జనసేన నాయకురాలు శివపార్వతి సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

​”కూటమిలో ఎప్పుడూ ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు. గెలిచినా ఓడినా అడుగు ముందుకే వేస్తాం. ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము.. ఈసారి మా కోసం మేము యుద్ధం చేస్తాం, వెనక్కి తగ్గేది లేదు” అంటూ పార్టీ శ్రేణులు తెగేసి చెప్పాయి. అధిష్టానం సహకరించి బీ-ఫామ్ ఇస్తే పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని, లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గానైనా బరిలో నిలుస్తామని స్పష్టం చేశాయి. చివరగా “సారీ పవన్ కళ్యాణ్ అన్నా.. ఈసారి మీ మాట వినలేము” అంటూ పార్టీ అధినేతను ఉద్దేశించి పేర్కొనడం స్థానిక కూటమి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీట్ల సర్దుబాటులో స్థానిక నాయకత్వం తమకు తగిన న్యాయం చేయలేదన్న ఆవేదనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కేడర్ చెబుతోంది.

Related News Desk తిరువూరు మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా పి. మాధవి నామినేషన్ దాఖలు