రాబోయే ఎనిమిది నెలల పాటు తీవ్ర నీటి ఎద్దడి పొంచి ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశంగా మారాయి (సోషల్ మీడియా సోర్స్). వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలోనే జలాశయాలు, భూగర్భ జలాల లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ నుంచి వచ్చే వేసవి మే నెల వరకు రానున్న 240 రోజుల పాటు నీటిని, విద్యుత్‌ను, ఆహారాన్ని అత్యంత పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ సంక్షోభం నుంచి గట్టెక్కగలమని ఈ సందేశం గట్టిగా హెచ్చరిస్తోంది.